తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సిద్దిపేట, కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం సిద్దిపేటకు వెళ్లిన ముఖ్యమంత్రి కలెక్టరేట్, సీపీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ప్రసంగించారు. సిద్దిపేట తాను పుట్టిన జిల్లా అని తెలిపారు. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీని మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సిద్దిపేటతో పాటుగా వరంగల్, నల్గొండ, నిజామాబాద్ లకు వెటర్నరీ కాలేజీలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో మంచినీళ్లకు ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం చెరువులన్నీ నిండి ఉన్నాయని, మే నెలలో కూడా చెరువులు అలుగుపారుతున్నాయని తెలిపారు.
Read: 40 ఏళ్ళ ‘గడసరి అత్త – సొగసరి కోడలు’
ఇందుకోసమే తెలంగాణ కోరుకున్నామని, తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడ్డామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక సబ్‌స్టేషన్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. కరెంట్ విషయంలో ఎంతటి బాధలు అనుభవించామో సిద్ధిపేట వాసులకు తెలుసునని తెలిపారు. కాకతీయ, రెడ్డి రాజులు గొలుసుకట్టు కట్టారు. సమైక్యపాలనలో చెరువులన్నీ ధ్వంసమయ్యాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాకముందే మిషన్ కాకతీయకు రూపకల్పన చేసినట్టు కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో మూడుకోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు.