Site icon NTV Telugu

CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు.. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ

Cm Kcr Decisions

Cm Kcr Decisions

CM KCR Took Important Decision In Secretariat Meeting: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో.. రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి.. రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతో క్రోడికరించి.. రాష్ట్రంలో మిగతా రైతులకు ఎలాగైతే రైతుబందు అందుతోందో, వీరికి కూడా అదే పద్ధతిలో రైతుబందు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Skyscrapers: ప్రపంచంలో అత్యధిక స్కైస్క్రాపర్స్ కలిగిన టాప్-10 నగరాలు

ఇందులో భాగంగా.. ప్రభుత్వమే బ్యాంక్ అకౌంట్‌ను తెరిచి, పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లోనే రైతుబంధును జమ చేస్తుందని అన్నారు. కొత్తగా పోడు పట్టాలు అందుకునే గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను సిఎం కేసిఆర్ ఆదేశించారు. అంతేకాదు.. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని కేసీఆర్ తెలిపారు. అలాగే.. ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను, అర్హులైన నిరుపేదలను గుర్తించి, వారి ఇండ్ల నిర్మాణాల కోసం ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్‌ను త్వరగా తయారు చేయాలని, జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. జులైలోనే దళితబందు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను కేసీఆర్ ఆదేశించారు.

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ హామీలన్ని అమలు చేస్తాం

జూన్ 14వ తేదీన వైద్య ఆరోగ్య దినోత్సవం నాడు.. నిమ్స్ దవఖానా విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. 2000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేయనున్నారు. ఇదే సమయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొననున్నారు.

Exit mobile version