CM KCR for Mahabubabad district tomorrow: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా జనవరి నెలలో నూతనంగా మరో 3 సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 18వ తేదీన ఖమ్మం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో..ఇవాళ మహబూబాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం, భీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేడు సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లును అధికారులు సిద్ధం చేశారు.
షెడ్యూల్ ఇదే..
ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేటకు బయలుదేరతారు.
బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి 10.15 గంటలకు హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌కు బయలు దేరుతారు.
ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ హెలీప్యాడ్‌కు కేసీఆర్ చేరుకుంటారు.
ఉదయం 11.10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
ఉదయం 11.40 నుండి 1.30 గంటల వరకు నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొంటారు.
సభ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు హెలికాప్టర్ లో చేరుకుంటారు.
మధ్యాహ్నం 1.55 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుకుని నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని ప్రారంభించనున్నారు.
మధ్నాహ్నం 2.55కు పబ్లిక్ మీటింగ్ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు.
మధ్నాహ్నం 3.20కి బహిరంగ సభ ముగించుకుని భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు 3.35 గంటలకు చేరుకుంటారు.
అంతేకాకుండా.. పార్టీ ఆఫీసు ప్రారంభించిన తరువాత 4.05కి అక్కడి నుంచి బయలుదేరి కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియానికి చేరుకోనున్నారు.
సాయంత్రం 4.30కి అక్కడి నుంచి ప్రయాణమై 5.30కి బేగంపేట ఎయిర్ పోర్టుకు తిరిగి చేరుకుంటారు.
అనంతరం సాయంత్రం 5.40 కి ప్రగతి భవన్‌కు చేరుకోవడంతో సీఎం పర్యటన ముగుస్తుంది.
అరెస్టుల పర్వం
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇవాళ సీఎం కేసీఆర్ మహబూబాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో.. జిల్లాలో పలు ఆదివాసి నాయకులు, ప్రతిపక్ష పార్టీలు, వీఆర్ఏలు,విద్యార్థి సంఘాలు,సిద్ధం కావడంతో గూడూరు,గార్ల,చిన్న గూడూరు,కొత్తగూడ, నెల్లికుదురు, కేసముద్రం, కొరివి, మరికొన్ని మండలాల్లో నిరసన గళం వినిపించేందుకు సిద్దమయ్యారు. అయితే పోలీసులు ఎటువంటి అవాంఛ సంఘటనలు జరగకుండా.. ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికి అక్కడ అరెస్టులు చేస్తున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పన ప్రకటన, పోడు సాగుదారులకు పట్టాల పంపిణీ, బయ్యారంలో స్టీల్ పరిశ్రమ నిర్మాణం తోపాటు పలు హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఇప్పటికే జిల్లాలో నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సీఎం పర్యటన ను అడ్డుకుంటారని నెపంతో ఎక్కడికి అక్కడ ఎవ్వరు దొరికితే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికే జిల్లాలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి గస్తీ చేస్తున్నారు.
ఈ నెల 18న ఖమ్మం నగరంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగసభకు జన ప్రభంజనం కోసం జిల్లా గులాబీ నేతలు కసరత్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈసభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టగా.. మరోవైపు పోలీసు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జనవరి 18న ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ తరఫున భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈసభ విజయవంతం కోసం బీఆర్‌ఎస్ నేతలు సమాయత్తమయ్యారు. అయితే.. ఈసభకు మరో మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ హాజరుకానున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటన సందర్భంగా.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితర నేతలు ఇప్పటికే జన సమీకరణపై దృష్టి సారించారు. అయితే.. ఖమ్మం పరిధిలో 5లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈసభలో పంజాబ్, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులకు సభ కోసం ఆహ్వానాలను పంపినట్లు సమాచారం. కాగా.. తొలి బీఆర్‌ఎస్ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని నేతలకు కేసీఆర్ సూచించారు. ఇక.. జిల్లా నేతలందరూ వ్యక్తిగత విభేదాలు వీడి కలిసి పనిచేయాలని ప్రజాప్రతినిధులకు కోరారు.
Manik rao Thackeray: తెలంగాణలో థాక్రే పర్యటన.. అక్కడకు రావాలని కోమటిరెడ్డి ఫోన్