CM KCR Speech In Telangana Assembly On Hyderabad Markets: హైదరాబాద్‌లో మార్కెట్‌లో విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. జనాభాకు అనుగుణంగా నగరంలో మార్కెట్లు లేవని, గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని, అవి కూడా శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని విమర్శించారు. దాదాపు కోటిన్నర జనాభా ఉన్న భాగ్యనగరంలో సరిపడా వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు లేవన్నారు. మురికిలో, మట్టి, దుమ్ములో కూరగాయలు అమ్మే పరిస్థితి ఉండేదన్నారు. ఈ నేపథ్యంలోనే సమీకృత వెజ్ & నాన్‌వెజ్ మార్కెట్లకు శ్రీకారం చుట్టామని, అధునాతన కూరగాయల మార్కెట్లు ప్రతి నియోజకవర్గంలో తేవాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు.
Legislative Council: మండలిలో జీవన్ రెడ్డి vs తలసాని.. ముందు నీ శాఖ చూసుకో
నిజాం హయాంలో నిర్మించిన మోండా మార్కెట్ ఓ అద్భుతం అని, దాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని కేసీఆర్ అన్నారు. ఆహార పదార్థాలపై బ్యాక్టీరియాలు దాడి చేయకూడదన్న ఉద్దేశంతో.. సైంటిఫిక్ రీసెర్చ్‌తో డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్‌ని ఇంగ్లీష్‌వాళ్లు తీసుకొచ్చారన్నారు. అలాంటి కాన్సెప్ట్‌తోనే మోండా మార్కెట్‌ని నిర్మించారన్నారు. కనీసం రెండున్నర అడుగుల ఎత్తులో నిత్యావసర వస్తువుల్ని అక్కడ అమ్ముతుంటారన్నారు. మోండా మార్కెట్‌ని కలెక్టర్లందరికీ చూపించామని, అలాంటి మార్కెట్లని అన్ని జిల్లాల్లో నిర్మించాలని సూచించామని తెలిపారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నారాయణపేట కూరగాయల మార్కెట్ చాలా అద్భుతంగా కట్టినట్లు తాను విన్నానని కూడా చెప్పారు.
Hyderabad Fake Baba Arrest: దొంగ బాబా అరెస్ట్.. 8వ పెళ్లి చివరి క్షణంలో బాగోతం బట్టబయలు
ఇదే సమయంలో కల్తీ విత్తనాల బెడద లేకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. కల్తీ విత్తనాలు మహబూబ్ నగర్‌లోని ఎక్కువగా ఉందని మండిపడ్డారు. కల్తీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ పెట్టామని తెలియజేశారు. పీడీ యాక్ట్ ఎందుకని కేంద్రం ప్రశ్నించిందని.. తాము ఒప్పించి దాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. కల్తీ విత్తనాలను పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రణాళికలు చేపడతామని చెప్పుకొచ్చారు.