Site icon NTV Telugu

CM KCR : పింఛన్లు పెంచుతాం.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్

Cm Kcr S

Cm Kcr S

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. అయితే.. ఈ రోజు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రతిపక్షాలు విసిరిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఏడెనిమిది సీట్ల ఆధిక్యంతో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్‌ అన్నారు. అయితే.. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. మేము రూ.లక్ష వరకు చేస్తామన్నాం. ఓట్లు గుద్దితే మాకు 88 సీట్లు, వాళ్లకు 19 సీట్లు వచ్చాయి. ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు నమ్మరు. పింఛన్లు కూడా పెంచుతాం. కానీ ఒకేసారి పెంచం. తప్పుడు హామీతో గెలుద్దామని కాంగ్రెస్ చూస్తోంది. మా అమ్ముల పొదిలో చాలా అస్త్రాలున్నాయి. ఒక్కొక్కటిగా ప్రయోగిస్తాం అని కేసీఆర్‌ తెలిపారు.

Also Read : Legislative Council : శాసనమండలిలో ఐదు బిల్లులు ఆమోదం

అప్పులు చేసిన రాష్ట్రాల్లో మనది 23 స్థానమని, అందరి కంటే తక్కువ అప్పులు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చిన జాబితాలో మనం తక్కవ అప్పులు చేసిన రాష్ట్రమన్నారు. కాంగ్రెస్ కేసీఆర్ కి పిండం పెడతాం అంటున్నారని, ఇవన్ని చేసినందుకా పిండం పెట్టేది అని ఆయన ధ్వజమెత్తారు. ఇదా సంస్కారం.. విచ్చల విడిగా మట్లాడుతున్నారు.. సంస్కారం ఉండాలి కదా.. మీరు మాట్లాడిన మాటలకు తటా తీసే వాళ్ళం.. సంయనం తో ఉన్నాం.. ఉద్యమంలో ఉన్న వాళ్లకు తుపాకులతో దూసుకుని పోయినోడు కాంగ్రెస్ అధ్యక్షుడు.. రాజీనామా చెయ్ అంటే అమెరికా పారిపోయాడు బీజేపీ అధ్యక్షుడు.. పిండం పెడతా అంటే.. బాధ అనిపిస్తుంది. పోలీసులకు చెప్పి చేయలేక పొదుమా.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెడతారో ప్రజలు ఆలోచిస్తున్నారు.. కరెంట్ ఇస్తాం అన్నది 9 గంటలు.. ఇచ్చింది ఆరు గంటలు.. మేము 24 గంటలు ఇస్తున్నాం అంటే దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.’ అని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Legislative Council : శాసనమండలిలో ఐదు బిల్లులు ఆమోదం

Exit mobile version