Site icon NTV Telugu

KCR: ఆర్టీసీని అమ్మాలని పీఎం ఆఫర్‌ పెట్టారు..

Kcr

Kcr

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదికగా జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు అధినేత కేసీఆర్‌. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా కావాలని ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించాలని ప్లీనరీ తీర్మానం చేసింది. ప్రత్యమ్నాయ ప్రజల అజెండాతో అమెరికా తరహా అభివృద్ధి సాధ్యమన్నారాయన. రాబోయే ఎన్నికల్లో తొంభై శాతం సీట్లు తామే గెలుస్తామని కుండబద్దలు కొట్టారు కేసీఆర్‌. ఈ ప్లీనరీలో మొత్తంగా 13 తీర్మానాలు ప్రవేశపెట్టారు. అలాగే కేంద్రంపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు కేసీఆర్‌. రాష్ట్రం ఏర్పడిన త‌ర్వాత ఏ ఒక్క రోజు కూడా మ‌నం డీజిల్ ధ‌ర, పెట్రోల్ ధ‌ర పెంచలేదు. కానీ కేంద్రం ఆకాశ‌మెత్తు పెంచిన డీజిల్ ధ‌ర‌ల‌తో ఆర్టీసీ మీద డైరెక్టుగా భారం ప‌డుతోంది. దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చి ఆ సంస్థను మ‌నం బ‌తికిస్తున్నామన్నారు.. ఆర్టీసీని త్వరగా అమ్మేయాల‌ని ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రైజ్‌లు పెట్టారంటూ మండిపడ్డారు.. ప్రధాని మోడీ ఆర్టీసీని అమ్మినవాళ్లకు 1000 కోట్ల రూపాయ‌లు బ‌హుమ‌తి పెట్టారని ఆరోపించారు.. ఆయ‌న అమ్మేది చాల‌ద‌ట‌. మ‌నం కూడా అమ్ముకోవాలట అని ఫైర్‌ అయ్యారు.

Read also: IPL: సన్‌రైజర్స్ సూపర్‌ బ్యాటింగ్‌.. గుజరాత్‌ ముందు భారీ లక్ష్యం..

Exit mobile version