నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పుడు నీళ్లు లేవు, కరెంట్ లేదు.. చాలా దుర్భర పరిస్థితి లు ఉండే.. అల్లా, భగవంతుని దయ వల్ల మీ సహకారం వల్ల అధిగమించామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దేశం అంతా చీకట్లో ఉంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని, దేశ వ్యాప్తంగా మైనారిటీ గురుకుల విద్యాలయాలు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
కేంద్రంకి రోగం సోకింది… చికిత్స చేయాలని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని, దేశం ఏ విధంగాను నష్ట పోకూడదన్నారు. కూల్చివేతలు, పడగొట్టడాలు సులువు… దేశాన్ని నిర్మించడం కష్టమని ఆయన వెల్లడించారు. ఇక్కడ అల్లర్లు చేసే వారి ఆటలు సాగవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి టర్కీ, ఇరాన్ అతిథిలు హాజరయ్యారు.
