Site icon NTV Telugu

మహిళలను ఆకాశానికెత్తిన కేసీఆర్‌.. ఏమన్నారంటే..?

టీఆర్‌ఎస్‌ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజుల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. మహిళలను ఆకాశానికెత్తారు. మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ రాజ్యం బాగుంటుందన్నారు. మహిళల్లో ప్రతిభావంతులు ఉంటారని, మహిళలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ముందు వరుసలో నిలబడాలన్నారు.

అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ నేతలకు చురకలు అంటిస్తూ.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదని, చేసిందే ఇక్కడ చెబుతున్నారన్నారు. అనాథలకు రాష్ట్ర ప్రభుత్వమే తల్లి తండ్రిని, ఎక్కడ అనాథలు ఉన్నా అందరని ప్రభుత్వం ఆదుకొని అండగా ఉంటుందని కేసీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే పునాదులని, ప్రతి ఒక్క కార్యకర్త కృషితోనే ఈ రోజు టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉందన్నారు.

Exit mobile version