Site icon NTV Telugu

MNJ Hospital: ఆసుపత్రిలోనే పాఠశాలు.. క్యాన్సర్ బాధిత పిల్లలకు సర్కార్ గుడ్ న్యూస్

Mnj Hospatel

Mnj Hospatel

MNJ Hospital: క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్యాన్సర్ బాధితుల పిల్లలు చదువుకు దూరమవకుండా ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. క్యాన్సర్ చికిత్స చాలా కాలం పాటు తీసుకోవచ్చు. కేన్సర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ రోజులు వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఒక జంట చాలా వారాల పాటు వారి పిల్లలతో ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది. దీంతో పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. దీన్ని గమనించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో చిన్నారుల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Read also: Vizag: బీచ్‌లో దారుణం.. అర్ధరాత్రి ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

సీఎం కేసీఆర్ ఆలోచనకు తమ మద్దతు ఉంటుందని ఎంఎన్‌జే ఆస్పత్రి యాజమాన్యం కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేన్సర్‌ చికిత్స కోసం అమ్మా,నాన్న ఆస్పత్రికి వెళ్తే వారితో వెళ్లే పిల్లలు చదువుకు దూరమవుతున్నారని వెల్లడైంది. దీనిపై మానవతా దృక్పథంతో ఆలోచించిన సీఎం కేసీఆర్.. కేన్సర్ బాధితుల చికిత్సతోపాటు వారి పిల్లల చదువుల కోసం అక్కడ ప్రత్యేక పాఠశాలను నెలకొల్పాలని ఆదేశించారని హరీశ్ రావు వెల్లడించారు. త్వరలో ఎంఎన్ జే ఆస్పత్రిలో అందుబాటులోకి రానున్న ఈ పాఠశాల వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా సాగుతుందన్నారు.
Koratala Shiva: ఎన్టీఆర్ ఒక్కడే నిలబడ్డాడు… ఆ నమ్మకం రిజల్ట్ ‘దేవర’ పోస్టర్

Exit mobile version