Site icon NTV Telugu

Command Control Centre: నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..

Command Control Centre

Command Control Centre

హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నేడు ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట 16నిమిషాలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. 20 అంతస్తులున్న టవర్‌ ఏ లోని 18 వ అంతస్తులో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఉంటుంది. ఇక్కడ 480 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, టవర్- డిలో రెండు ఫ్లోర్లు, మీడియా కేంద్రంతో పాటు, ట్రైనింగ్ సెంటర్లు, మొత్తం 12 లిఫ్టులు ఏర్పాటు చేశారు.

కేటీఆర్‌ ట్విట్‌:
అయితే.. ప్రపంచస్థాయి సాంకేతికతతో కొలువు దీరిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నేడు సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇది అత్యంత అధునాతన ప్రభుత్వ సదుపాయం భారతదేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్మించి ఉండదని పేర్కొన్నారు. దేశంలో ఈ తరహా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఇదొక్కటే అయ్యి ఉంటుంది’అని బుధవారం తన ట్వీట్‌లో మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

రూ. 600 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని, సేఫ్ సిటీ ప్రాజెక్టు, కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9.22 లక్షల సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానిస్తారు. పోలీసులు ఏ క్షణంలో అయినా లక్ష కెమెరాలను పర్యవేక్షించేలా తీర్చిదిద్దారు. క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ కు మద్దతుగా తెరవెనక పనిచేసే టెక్నికల్ టీంతో వార్ రూమ్ ఏర్పాటు చేసారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సోషల్ మీడియా యూనిట్లు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండనున్నాయి.

అయితే.. 2016లో నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ… నిధులలేమితో పనులు కొనసాగుతూ వచ్చాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని రహదారులు, భవనాలశాఖ నిధులు మంజూరు చేసింది. ముంబయికి చెందిన నిర్మాణ సంస్థ షాపూర్ జీ-పల్లోంజి ఇంజినీర్లు రేయింబవళ్లు పనులు చేశారు. ప్రస్తుతానికి టవర్-ఏ లో పనులు పూర్తయ్యాయి.

ట్రాఫిక్ ఆంక్షలు
నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సం కారణంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ సూచనలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో ఆస్పత్రి, ఫిల్ద్ నగర్ వైపు వచ్చే ట్రాఫిక్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్, సైబరాబాద్ వైపు మళ్లింపు, మాసాబ్ ట్యాంక్ నుంచి రోడ్ నెంబర్ 12 వచ్చే వాహనాలను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ ఆస్పత్రి వైపు మళ్లించనున్నారు. ఫిల్మ్ నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, ఎన్టీఆర్ భవన్ వైపు మళ్లించనున్నారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version