భాగ్యనగరంలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు.
కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని అనేకసార్లు ప్రధానిని అడిగినా ఫలితం లేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయ పరమైన నిధులపై కేంద్రం కోత విధించిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దారుణంగా విఫలం అయిందన్నారు. రైతాంగ సమస్యలపై కేంద్ర మంత్రులు హేళనగా మాట్లాడారని చెప్పారు. దేశంలో రైతులు బిక్షగాళ్ళు కాదని.. రైతులతో పెట్టుకోవద్దని కేసీఆర్ మరోసారి కేంద్రాన్ని హెచ్చరించారు.
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య, అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషాసింగ్‌ను సీఎం కేసీఆర్ సమున్నత రీతిలో సత్కరించారు. మొగులయ్యకు రూ.కోటి చెక్ అందజేశారు. క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషాసింగ్‌కు రూ.2 కోట్ల చొప్పున చెక్కులను అందించారు. అంతర్జాతీయ వేదికలపై పసిడి పతకాలతో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన ఇద్దరు క్రీడాకారులకు నగదు ప్రోత్సాహంతో పాటు జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో నివాస స్థలాలు ప్రభుత్వం ఇవ్వనుంది.
Punjab :పంజాబ్ తీవ్రవాదం, మాఫియాతో రగిలిపోనుందా ? మళ్లీ ఖలిస్థాన్ గా మారబోతుందా ?
