NTV Telugu Site icon

CM KCR: కల్లుగీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త

Kcr Kallugeetha Good News

Kcr Kallugeetha Good News

CM KCR Good News For Kallugeetha Workers: తెలంగాణ రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే.. కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ బీమా ద్వారా.. కల్లగీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోతే, ఆ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం ప్రభుత్వం నుంచి అందుతుంది. నేరుగా వారి ఖాతాలోకే ఆ డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా సీఎం చెప్పారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాల్సిందిగా రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌ను, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం ఆదేశించారు.

DC vs GT: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

కల్లుగీత సందర్భంగా.. ప్రమాదవశాత్తూ జారిపడి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ఊహించని సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నా.. ఆ డబ్బులు బాధితుల కుటుంబాలకు అందడంలో ఆలస్యం అవుతోందని, ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా తరహాలోనే కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మంగళవారం నాడు డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.

Chikoti Praveen: పోకర్ ఇల్లీగలని తెలీదు.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నా