NTV Telugu Site icon

T Hub Hyd: ఈ నెల 28న ప్రారంభం.. కేటీఆర్ ట్వీట్ పై స్పందిస్తున్న స్టార్లు

T Hub

T Hub

హైదరాబాద్ ప్రతిష్ట పెంచేలా.. నగరం సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ‘టీ హబ్’ ను ఈ నెల 28న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దానిని సృష్టించడం’’ అనే అబ్రహం లింకన్ వ్యాఖ్యలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ కు పెద్ద పీట వేస్తూ టీహబ్ కొత్త సముదాయాన్ని ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం.

టీహబ్ ప్రారంభిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేయగా సినీ స్టార్లు, క్రీడా ప్రముఖులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అడవి శేష్, సందీప్ కిషన్, పీవీ సింధు, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, గగన్ నారంగ్, పారుపల్లి కశ్యప్ వంటి వారు ట్వీట్లు చేస్తున్నారు. హైదరాబాద్ ఎకో సిస్టమ్ ముందుకు తీసుకెళ్లేందుకు ఇది గొప్ప ముందడుగుగా మహేష్ బాబు అభివర్ణించారు. గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. టీ హబ్ గొప్ప భవిష్యత్ కోసం అని.. కొత్త వ్యాపారాలకు సానుకూలం అని, ఉద్యోగాలు సృష్టించబడతాయని, ప్రతీ ఏడాది రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని ప్రేమించండి అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.