Cm KCR : బీఆర్ఎస్ పునాదిరాయి మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. వామపక్ష, గులాబీ కార్యకర్తలకు జోష్ నింపారు. బీఆర్ఎస్ పునాదిరాయి మునుగోడు ఉప ఎన్నిక. మీరే ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి. దేశం బాగుపడాలంటే మీరు అడుగు ముందుకేయాలి. మునుగోడును గుండెల్లో పెట్టుకుంటా. దేశంలో జరిగే పోరాటంలో మీరే పునాది రాయి వేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవాలి. ఎనిమిదేళ్ళయినా మా నీళ్ళు చూపడానికి, మా వాటా ఎప్పుడిస్తావు? నేను మహా మొండి. వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవిన్యూ డివిజన్ ఇస్తా. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లో మీ కోరిక నెరవేరుస్తా. ప్రజల్లో ఉండే మనిషిని ఓడించి.. రాజగోపాల్ రెడ్డిని 2018లో గెలిపించారు. గొడ్డలిని గెలిపించారు అభివృద్ది లేదు. రోడ్లన్నీ బాగుచేస్తా. గెలిచినవారు పత్తా లేరు. కష్టానికి వచ్చారు. ఆయన్ని గెలిపించండి.
ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామనుకున్నారు. రూ.100 కోట్లు ఇస్తామన్నా ఆత్మగౌరవాన్ని కాపాడారు.. ఎడమకాలి చెప్పుతో కొట్టినట్లు వారికి బుద్ది చెప్పారు.. ఇంత అరాచకం జరుగుతుంటే మౌనం పాటిద్దామా? రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని మా ఎమ్మెల్యేలు నిరూపించారు. ఆర్‌ఎస్‌ఎస్ ముసుగులో వచ్చి చంచల్‌గూడ జైల్ లో ఉన్నారు.. వందల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో విచారణలో తేలాలి. దీని వెనక ఉన్నవాళ్లు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీళ్లేదు. మోడీ రెండు సార్లు పీఎం అయ్యావు .. ఇంకేం కావాలన్నారు సీఎం కేసీఆర్.
Read Also: Mamata Banerjee: దేశంలో అధ్యక్ష తరహా పాలన.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..
నీటి వాటా ఎందుకు తేల్చవు మోడీ ? మునుగోడు లో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే బాధ్యత నాది. ప్రభాకర్ రెడ్డి నీ గెలిపించండి…15 రోజుల్లో 100 పడకల ఆసుపత్రి ,రెవెన్యూ డివిజన్ ఇస్తాం. ప్రభాకర్ రెడ్డి నీ గెలిపించండి…మునుగోడులో రోడ్లు బాగు చేయిస్తానన్నారు. మునుగోడు వారికి చెంపపెట్టు కావాలి. వామపక్ష, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి. మంత్రి జగదీశ్వర్ రెడ్డిని నిషేధించారు. ఎవరినైనా కొట్టారా? ఆయన ప్రచారాన్ని ఎందుకు ఆపారు? మూడవ తేదీన మీ సత్తా చాటండి. శాంతియుతంగా, హింసకు పోకుండా వారికి బుద్ధి చెప్పాలి. వడ్లు కొనమంటే నూకలు తినమన్నారు…అలాంటివారి తోకలు కట్ చేయాలి. ఇంటికి తులం బంగారం అంటారు. మూడో తేదీ తర్వాత ఎవరైనా కనబడతారా? గెలిచాక ఎవరూ కనిపించరు. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్. గోల్ మాల్ కావద్దు. మనకు చైతన్యం వుంటే వాళ్ల ఆటలు సాగవు.
చేనేతల బడ్జెట్ భారీగా పెంచాం. చేనేత బీమా తెచ్చాం.. రైతు బీమా లేదు. దేశంలో లేనిది మనం తెచ్చుకున్నాం. రైతు బంధు ఇస్తున్నాం. కేసీఆర్ వున్నంతకాలం దానిని ఎవరూ ఆపలేరు. ఉచితాలు ఆపాలట.. కార్పోరేట్ గద్దలకు 14లక్షల కోట్లు మాఫీ చేశాడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే లక్ష 40 వేల కోట్లు అవుతుంది. మోడీగారు మీ సమాధానం ఏంటి? ఢిల్లీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలను కొందామని వచ్చి, జైలులో వున్నారు. తడిబట్టలతో ప్రమాణం చేయాలా? కేసు కోర్టులో వుంది. నేను మాట్లాడకూడదు. దుర్మార్గులను బంగాళాఖాతంలో కలిపేయాలి. పెట్టుబడిదారుల తొత్తుల్ని తన్ని తరిమేయాలి. సాగనంపాలి. లేకుంటే దేశం బాగుపడదన్నారు సీఎం కేసీఆర్.