NTV Telugu Site icon

Bandi sanjay: అన్నదాతలు అల్లాడుతుంటే.. ఆయన ఢిల్లీకి పోవుడేంటి?

Bandi Sanjay Kcr

Bandi Sanjay Kcr

Bandi sanjay: అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రోడ్లపై తడిసిన ధాన్యం ఆరబోస్తున్న రైతుల వద్దకు బండి సంజయ్ వెళ్లి వారి బాధలు తెలుసుకున్నారు. అనంతరం గంభీరావుపేట సమీపంలోని ఐకేపీ సెంటర్‌లో బతుకమ్మ చీరలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులను కలిశారు. అనంతరం నాగంపేట గ్రామంలో వడగళ్ల వానతో ముంపునకు గురైన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? క్షేత్రస్థాయికి వెళ్లని సీఎంను ఏం చేయాలి? కేసీఆర్ అహంకారం తలకెక్కింది. రైతులు అల్లాడిపోతుంటే కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? యుద్ధప్రాతిపదికన ఎకరాకు రూ.30 వేలు పరిహారం అందించాలి. నిర్ణీత వ్యవధిలో కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటే 30 శాతం మంది రైతులు నష్టపోయేవారు కాదు. పంటలు సరిగా పండకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. కౌలు రైతుల కష్టాలు వర్ణనాతీతమన్నారు. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించాలి. క్షేత్రస్థాయి నుంచి వాస్తవ నివేదికలు తీసుకురావాలి. రైతులను ఆదుకోవాలి. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి సాయంపై చర్చిస్తాం. రైతులను ఎలా ఆదుకోవాలో ఆలోచించాల్సిన మంత్రులు వారిని తప్పించేందుకు ఇతరులపై నెట్టివేయడం సిగ్గుచేటన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేక.? నిజంగా ప్రభుత్వం ఉందన్న నమ్మకం ఉంటే ఇప్పటికైనా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధప్రాతిపదికన సాయం అందించాలని బండి సంజయ్ కోరారు.

Read also: CM KCR Delhi Tour: ఢిల్లీకి సీఎం కేసీఆర్.. ఎప్పుడంటే?

పంచాయతీ సెక్రెటరీల సమ్మెకు మద్దతు తెలుపుతున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై సీఎం కి బహిరంగ లేఖ రాస్తున్నానని తెలిపారు. కార్యదర్శుల న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని శాఖల ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ కార్యదర్శులు తల్చుకుంటే ప్రభుత్వం సంగతి ఏమైతది తెలుసుకోవాలన్నారు. అయినా వారు చట్టం పరిధిలో సమ్మె చేస్తున్నారని తెలిపారు. గొడ్డు చాకిరీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ లేని విధంగా నాలుగేళ్లు ప్రొబేషనరీ ఏంటి? అని ప్రశ్నించారు. ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన ఇంకా ఎందుకు రెగ్యులర్ చేయడం లేదని మండిపడ్డారు. ఎన్నికలకు ఐదు నెలల ఉంది కేసీఆర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఆరోపించారు. వారి ఉద్యమానికి బీజేపీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని మండిపడ్డారు. పంచాయతీ కార్యాదర్శులను వేధిస్తే… ఊరుకోమని, వారి తరఫున మేము పోరాడతమన్నారు. జైల్ కి పోవడానికి సిద్ధం… జైళ్లు మాకు కొత్త కాదన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వం ఐదు నెలల తర్వాత మా ప్రభుత్వం వస్తుందన్నారు. మేము పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామన్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు.. ఆర్టీసీ సింగరేణి కార్మికులు కూడా సిద్ధం కావాలని.. మీకు అండగా బీజేపీ ఉంటదని పిలుపు నిచ్చారు. మీరు గతంలో తెలంగాణ కోసం చేసిన ఉద్యమాలను పోరాటాలు గుర్తు చేసుకోవాలన్నారు. ఉద్యోగులను కార్మికులను కోరుతున్న… మలిదశ పోరాటానికి సిద్ధం కావాలని కోరుతున్నామన్నారు. కేసీఆర్ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కి వేల కోట్లు పంపిణీ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
Mayor Vijayalakshmi: సిగ్గు లేదా అని మాట్లాడతారా? బీజేపీ కార్పొరేటర్లపై మేయర్ ఫైర్‌..