NTV Telugu Site icon

గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన సీఎం కేసీఆర్..

KCR Governor

తెలంగాణ రాష్ట్రం ఇవాళ అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటుంది.. క‌రోనా స‌మ‌యంలో.. ఎలాంటి హ‌డావుడి లేకుండా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.. ఉద‌యం అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు.. ఆ త‌ర్వాత రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్‌కు రాష్ర్ట ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం.. ఇవాళ గ‌వ‌ర్న‌ర్ పుట్టిన రోజు కూడా కావ‌డంతో ఆమెకు బొకేను అందించిన విషెష్ చెప్పారు.. ఆమె ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌ని ఆకాంక్షించారు. తాజా ప‌రిస్థితుల‌పై కూడా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు..