NTV Telugu Site icon

Sridhar Reddy: తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం

Sridhar Reddy Died

Sridhar Reddy Died

CM KCR Condolences Message On Sridhar Reddy Death: తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్శిటీ నాటి విద్యార్థి సంఘం నేత డాక్టర్ శ్రీధర్ రెడ్డి నేడు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని తట్టి లేపిన వారిలో శ్రీధర్ రెడ్డి ఒకరు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శ్రీధర్ రెడ్డి ఉన్నత చదువులు చదివారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఈయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Crime News : ప్రేమను నిరాకరించిందని అమ్మాయిని కత్తితో పొడిచిన పవన్ కల్యాణ్

శ్రీధర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నాటి 1969 ఉద్యమంలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్రను పోశించారన్నారు. తొలి, మలి దశల్లో తెలంగాణ ఉద్యమానికి శ్రీధర్ రెడ్డి చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తాను నమ్మిన విలువల కోసం శ్రీధర్ రెడ్డి కట్టుబడి, రాజీపడకుండా పనిచేశారని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇదే సమయంలో మానవతారాయ్ మాట్లాడుతూ.. శ్రీధర్ రెడ్డి మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోట‌ని అన్నారు. ఆయన నిఖార్సైన తెలంగాణ పోరాట యోధుడని చెప్పారు.

Jogi Ramesh: 40 ఇయర్స్ ఇండస్ట్రీ 40 మందిని బలి తీసుకున్నాడు

టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి కూడా శ్రీధర్ రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. శ్రీధర్ రెడ్డి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న గొప్ప నాయకుడని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తాను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని.. శ్రీధర్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.

Show comments