Site icon NTV Telugu

Mallannasagar: మ‌ల్లన్న సాగ‌ర్‌లో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు…

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ల్ల‌న్న సాగ‌ర్‌కు చేరుకున్నారు. ఈరోజు మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌ను రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్నారు. హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ ద్వారా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌కు చేరుకున్నారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హ‌రీష్‌రావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ అతిపెద్ద రిజ‌ర్వాయర్‌. ఈ రిజ‌ర్వాయ‌ర్ లో 50 టీఎంసీల నీటిని నిల్వ‌చేసే సామ‌ర్థ్యం ఉంటుంది. ఈ రిజ‌ర్వాయ‌ర్ ద్వారా హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల‌కు తాగునీటిని స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. అదేవిధంగా పారిశ్రామిక అవ‌స‌రాల‌కోసం కొంత నీటిని వినియోగించ‌నున్నారు. వీటితోపాటు ఆయ‌క‌ట్టుకు సాగునీటిని అందిస్తారు.

Read: Live: సీఎం కేసీఆర్ మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ టూర్

Exit mobile version