NTV Telugu Site icon

CM KCR: ఐఎఫ్ఎస్ సాధించిన రాజు.. అభినందించిన సీఎం

Cm Kcr

Cm Kcr

తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్ -2021లో 86వ ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌సీఆర్‌ఐ) విద్యార్థి కాసర్ల రాజును మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అభినందించారు. రాజు స్ఫూర్తితో కళాశాల నుంచి మరింతమంది విద్యార్థులు ఇలాంటి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.

జనగాం జిల్లా సూరారం గ్రామంలో కాసర్ల రాజు చెందినవాడు. అతను గత సంవత్సరం బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేసాడు. ప్రస్తుతం అతను ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (FCRI)’లో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీని అభ్యసిస్తున్నాడు. ఫారెస్ట్రీ మరియు జియాలజీ లను ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకొని అతను ఐఎఫ్‌ఎస్‌ సాధించాడు. ఎఫ్సీఆర్ఐ (FCRI) వంటి ప్రపంచ స్థాయి సంస్థను స్థాపించి, తనలాంటి విద్యార్థులకు అటవీ విద్యను అభ్యసించడానికి, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యుత్తమ పోటీ పరీక్షలను లక్ష్యంగా చేసుకునేందుకు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు.. రాజు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ ఘనత సాధించిన రాజును ఎఫ్సీఆర్ఐ (FCRI) డీన్ ప్రియాంక వర్గీస్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్ సాధనలో తనకు ప్రేరణనిచ్చి అన్ని రకాలుగా సహకరించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, డిప్యూటీ డైరెక్టర్ కె. శ్రీనివాస్, డిసిఎఫ్ ఎ.నరసింహ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బందికి రాజు ధన్యవాదాలు తెలియజేసారు.

Gowtham Raju: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఎడిటర్ గౌతంరాజు కన్నుమూత