టీఆర్ఎస్ సుపంపన్నమైన పార్టీగా ప్రకటించారు గులాబీ దళపతి కేసీఆర్.. 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ మనది… నేను ఒక పిలుపిస్తే ఒక్కో కార్యకర్త వెయ్యి రూపాయలు ఇస్తే అదే రూ.600 కోట్లు అవుతుందన్నారు.. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడిన కేసీఆర్.. విదేశాలకు పార్టీ ప్రతినిధులను పార్టీ స్వంత ఖర్చుతో పంపిస్తామని.. రూ.451 కోట్ల బ్యాంక్ ఎఫ్‌డీలు ఉన్నాయన్నారు.. రూ.861 కోట్లు టీఆర్ఎస్ కలిగి ఉందన్న ఆయన.. రూ.3.84 కోట్లు ప్రతీ నెలా వడ్డీ రూపంలో పార్టీ ఖాతాలో ఉంటాయన్నారు.. అన్ని కలిపితే వెయ్యి కోట్ల అసెట్స్ కలిగి ఉన్నాం.. 2 ఇన్నోవాలు, ఒక ఫోర్డ్ వెహికిల్ పార్టీకి ఉంది.. పుష్కలంగా అన్ని రకాల వనరులు కలిగి ఉన్న పార్టీ మనది అన్నారు కేసీఆర్.
Read Also: Patnam Mahender Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీపై కేసు నమోదు
ఇక, రాబోయే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేసీఆర్.. ఓ కన్సల్టెన్సీ సర్వే 90 శాతం సీట్లు మనకే వస్తాయని చెప్పిందన్నారు.. దేశంలో ఎవరూ సంతృప్తిగా లేరన్న ఆయన.. ఎవరో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. ప్రత్యామ్నాయ నిజమైన ప్రజల ఎజెండా రావాలి… అందర్నీ కలుపుకుని సర్వజన సౌభ్రాతృత్వంతో ముందుకు వెళ్తామని ప్రకటించారు.. ప్రధాని మోడీ నిర్వహించేది వీడియో కాన్ఫరెన్స్ కాదు డ్రామా కాన్ఫరెన్స్ అంటూ ఫైర్ అయ్యారు కేసీఆర్.. సిగ్గు ఎగ్గూ లేదు పీఎం మాట్లాడటానికి? మీరు ఎందుకు పెట్రోల్, డీజిల్ మీద సెస్ పెంచారు అని నిలదీశారు.. తెలంగాణ వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ మీద టాక్స్ పెంచలేదు. రౌండప్ చేశాం అంతే అన్నారు.