NTV Telugu Site icon

Congress Meeting: పార్టీ అధిష్ఠానానిదే ఆ బాధ్యత.. ముగిసిన సీఎల్పీ భేటీ

Congress Clp Meting

Congress Clp Meting

Congress Meeting: కాంగ్రెస్ ఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌ మాణిక్యరావు ఠాక్రే నేతృత్వంలో సీఎల్పీ సమావేశం జరిగింది. గెలిచిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలించారు. సీఎం ఎవరన్నది, డిప్యూటీ సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని.. సీఎల్పీ అభిప్రాయాలను హైకమాండ్‌కు పంపామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. తెలంగాణ సీఎం ఎవరన్నది ఎమ్మెల్యేలందరితో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారని డీకే శివకుమార్ వెల్లడించారు. అందరితో చర్చించి సీఎం పేర్లను సీల్డ్ కవర్‌లో హైకమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

Read also: Congress IT Minister: తెలంగాణ ఐటీ మినిస్టర్ ఎవరు? ఇప్పుడు చర్చంతా ఆ పదవి గురించే!

ఈరోజు అంటే ఈరోజు తుది నిర్ణయం ప్రకటిస్తామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.సీఎల్పీ సమావేశంలో రేవంత్‌ రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్య్యేలు దానిని బలపరిచారు. రెండు మూడు గంటల్లోనే సీఎల్పీ నేత ఎవరనే దానిపై స్పష్టత రానుందని కాంగ్రెస్ సీనియర్‌ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరు సీఎం అయినా సహకరిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.