Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్ర.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పటినుంచో చర్చనీయాంశంగా మారిన అంశం. ఈ యాత్రపై ఇవాళ క్లారిటీ రాబోతోంది. షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే సేవ్ కాంగ్రెస్ వాదులుగా చెప్పుకునే నేతలు ఈ యాత్రకు హాజరవుతారా? లేదా? రాహుల్ పాదయాత్రకు కొనసాగింపుగా హాత్ సే హాత్ జోడో పేరుతో యాత్ర చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. కాగా.. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఆయన విడుదల చేశారు రేవంత్. ఈ కార్యక్రమంపై టీపీసీసీ కార్యవర్గంతో పాటు డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరగనుంది. ఇక, ఏఐసీసీ నుంచి కీలక నేత హాజరుకాబోతున్నారు. రేవంత్ రెడ్డి యాత్రతో పాటు సోషల్ మీడియా, ఎన్నికల కమిషన్, ధరణి పోర్టల్ సహా పలు అంశాలపై చర్చ జరగనుంది. అయితే తాజాగా.. దిగ్విజయ్ సింగ్ వచ్చి నేతల అభిప్రాయాలైతే తీసుకున్నారు.. కానీ దానికి సంబంధించి పార్టీలో ఎలాంటి నిర్ణయాలు మార్పులు జరగలేదు. ఇలాంటి టైమ్‌లో పీసీసీతో కలిసి నడిచేదెవరు? పట్టించుకోకుండా పక్కకు పోయేవారో? చూడాలి మరి.
Read also: Granules: ఏపీలో మరో భారీ పెట్టుబడి.. కుదిరిన ఒప్పందం
అయితే.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు. హత్ సే హత్ జోడోలో బ్లాకుల వారీగా పాదయాత్ర నిర్వహిస్తామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అభియాన్ ముగింపులో భాగంగా హైదరాబాద్‌లో జరిగే సభకు రాహుల్ గాంధీ వస్తారని ఆయన తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన సర్క్యూలర్‌లో 2 నెలల పాదయాత్ర అని వుందని కానీ.. జనవరి 26 నుంచి 5 నెలల పాటు పాదయాత్ర అన్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఏఐసీసీ వెల్లడించిందన్నారు. ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వేడి చల్లారకుండా.. ఆ యాత్రకు కొనసాగింపుగా కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే.. అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లు ఈ యాత్ర చేపట్టాలని ఏఐసీసీ ఇప్పటికే ఆదేశించిన క్రమంలో మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Jaydev Unadkat: చరిత్ర సృష్టించిన జయదేవ్.. ట్రోఫీ హిస్టరీలోనే తొలిసారి
