సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు జస్టిస్ ఎన్వీ రమణ.. రాజ్‌భవన్‌లో ఆయన బస చేస్తున్నారు.. రోజూ పలువురు ప్రముఖులు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిన్న యాదాద్రి వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు ఎన్వీ రమణ దంపతులు.. మరోవైపు, ఇతర ప్రముఖులను కలిసిందేకు ఆయన కొన్ని సార్లు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు.. ఇవాళ ఎస్ఆర్ నగర్ లోని తన నివాసానికి వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ ను నిలిపివేశారు పోలీసులు.. ఇది గుర్తించిన సీజేఐ.. హైదరాబాద్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తన పర్యటనలో తనకోసం ట్రాఫిక్‌ను నిలిపివేసి ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని సూచించారు.. కాగా, ఈ నెల 19వ తేదీ వరకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు సీజేఐ ఎన్వీ రమణ. సాధారణంగా వీఐపీల వస్తున్నారంటూ.. ట్రాఫిక్ ఆపడం పరిపాటి.. కానీ, తాను కూడా సామాన్యుడిగానే ప్రయాణం చేయాలని.. తన కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నారు జస్టిస్ ఎన్వీ రమణ.