QNET Scams: క్యూ నెట్ మోసాలపై సిటీ పోలీస్ చర్యలు చేపట్టింది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఆరుగురి మృతికి కారణమైన క్యూనెట్ సంస్థపై చర్యలు తీకోనున్నట్లు వెల్లడించింది. స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు క్యూనెట్ సంస్థ ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోటి క్యూనెట్ లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులకు వల వేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడినట్లు గుర్తించారు అధికారులు. పెట్టుబడులు పెడితే భారీ లాభాలు ఇస్తామంటూ స్వప్నలోక్ సంస్థ ప్రతినిధులు మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి క్యూనెట్ వ్యాపారం చేసినట్లు గ్రహించారు. స్వప్నలోక్ ఆరుగురు మృతికి కారణమైన ముగ్గురు క్యూనెట్ సంస్థ ప్రతినిధులు అరెస్ట్ చేశారు.
స్వప్పలోక్ ఘటనతో తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసింది. మార్చి 19 2023 అందరికి తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువతులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. వీరంతా ‘క్యూ నెట్’ అనే కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే వారు పనిచేసిన క్యూనెట్ కంపెనీపై ప్రభుత్వం కూపీ లాగుతోంది. ఈ క్యూనెట్ కంపెనీ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలను దోచుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిపై వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సూచించారు. ఘటన జరిగిన సమయంలో క్యూనెట్ బాధితురాలు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ కంపెనీపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని.. ఈ కంపెనీ నిరుద్యోగులను మోసం చేస్తోందని బాధితుడు ఫణి ఆవేదన వ్యక్తం చేశాడు. 5 లక్షలు చెల్లించి మోసపోయానని 2018లో ఫిర్యాదు చేశాడు. తమ కేసు సుప్రీంకోర్టులో ఉందని తెలిపాడు.
అయితే దీంతో క్యూనెట్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. చనిపోయిన ఆరుగురు కష్టపడి క్యూ నెట్‌వర్క్‌లో చేరారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో యూనిట్ కంపెనీ డబ్బులు ఇస్తానని, కమీషన్ కూడా ఇస్తానని మాయమాటలు చెప్పి మోసం చేస్తోంది. ఈ క్యూనెట్‌లో 40 మందికి పైగా యువకులు పనిచేస్తున్నారు. క్యూనెట్ ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి ఒకటిన్నర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. Qnet మోసపూరిత వాగ్దానాలు చేయడం ద్వారా యువతను ఆకర్షిస్తుంది. మలేషియా, సింగపూర్ లకు తీసుకొచ్చేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.అయితే.. ఈ విషయం బయటకు రావడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. గతంలో సజ్జనార్ క్యూనెట్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే క్యూ నెట్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న సంస్థపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క్యూ నెట్ కారణంగా మధ్యతరగతి కుటుంబాలు నష్టపోతున్నాయి.” సజ్జనార్ వెల్లడించారు.
Helmets-Hair loss: హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా? అయితే..