Site icon NTV Telugu

Cinema Love Story: ఇద్దరమ్మాయిలు ఓ అబ్బాయి.. వింత ప్రేమ కథ

Love 2 In 1

Love 2 In 1

ఈమధ్యకాలంలో సినిమాలు చూసి, యూట్యూబ్ వీడియోలు చూసి నేరాలు, ఘోరాలు, ప్రేమలకు గురవుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిందో స్టోరీ. ఇది సినిమాని మించిన కథ. సినిమా కథకు తీసిపోని లవ్ స్టోరీ ఇది అంటున్నారు పోలీసులు. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు పోలీసులు. నేను పెళ్లి చేసుకుంటాను కాదు కాదు నేను చేసుకుంటాను అంటూ ఇద్దరమ్మాయిలు ఓ అబ్బాయి కోసం గొడవపడి పోలీసులను ఆశ్రయించగా పోలీసులకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు.

Read Also: Rapido Rider Died: రాయదుర్గం దగ్గర రోడ్ యాక్సిడెంట్.. ర్యాపిడో రైడర్ మృతి

అసలు కథేంటంటే.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్ల పాడుకు చెందిన మాచర్ల రోహిత్ అనే యువకుడు స్వగ్రామంలో తనకు కజిన్ వరస అయిన అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు .అది చాలదన్నట్లు తల్లాడకి చెందిన మరో ముస్లిం యువతీ షేక్ సాహినితో సంబంధం పెట్టుకున్నాడు. ఇరువురు యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న పాతర్లపాడు గ్రామంలో ఖాళీగా ఉంటున్న డబల్ బెడ్ రూమ్ ఇంట్లో పాతర్లపాడు అమ్మాయితో కలసి ఉండగా ముస్లిం యువతీకి తెలిసింది.

దీంతో తన బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది .అక్కడ వీరంతా ఘర్షణ పడ్డారు. ఇద్దరు యువతులు ఎవరికివారు అబ్బాయితో తనను పెళ్లి చేసుకోవాలంటే తనని పెళ్లి చేసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అక్కడున్న బంధువులకు ఏమి చేయాలో అర్థం కాక పోలీసులను ఆశ్రయించారు . ఇద్దరు యువతులు మేజర్లే …..ఇద్దరు ఒకే యువకుడ్ని తనను అంటే తననే పెళ్లి చేసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు . లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని అనడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సినిమాల ప్రభావం వల్లే ఇలాంటి వింత అనుభవం ఎదురవుతోందని పోలీసులు అంటున్నారు. మరి ఈ యువకుడు ఎవరిని పెళ్లాడతాడో, మరో యువతి ఏం చేస్తుందో చూడాలి.

Read Also: Prabhas: ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. సౌతిండియాలోనే ఈ అవకాశం దక్కించుకున్న తొలి హీరో

Exit mobile version