NTV Telugu Site icon

Assembly Budget Session: తెలంగాణలో సిగరెట్లు, పొగాకు యాడ్స్‌ నిషేధం..!

Hukka Sigarets

Hukka Sigarets

Assembly Budget Session: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో హుక్కా సెంటర్లను నిషేధిస్తూ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు మంత్రి శ్రీధర్ బాబు సభకు ధన్యవాదాలు తెలిపారు. హుక్కా సెంటర్లను నిషేధించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. యువత ధూమపానానికి అలవాటు పడే అవకాశం ఉందన్నారు. పొగ కంటే హుక్కా హానికరం అని అంటారు. అంతకుముందు మృతి చెందిన సభ్యులకు శాసనసభలో సంతాపం తెలిపారు. ఫిబ్రవరి 4న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హుక్కా నిషేధంపై నిర్ణయం తీసుకున్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. సిగరెట్ కంటే హుక్కా 1000 రెట్లు హానికరం.. ఒక్కసారి హుక్కా అలవాటు చేసుకుంటే.. యువత అడిక్ట్ అవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర యువత, ప్రజల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. హుక్కా, హుక్కా సెంటర్లపై శాశ్వత నిషేధం విధిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు.

Read also: Sreeleela: డార్క్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న శ్రీలీల…

హుక్కా నిషేధానికి సంబంధించిన బిల్లును సభలో ఎలాంటి చర్చ లేకుండానే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ బిల్లు రాకతో ఇక నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హుక్కా సెంటర్లు బంద్ కానున్నాయి. హుక్కా నిషేధం అమల్లోకి వచ్చింది. హుక్కా సంబంధిత ఉత్పత్తులను కొనడం లేదా విక్రయించడం నేరం. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు సహచర సభ్యులకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. యువత ధూమపానానికి దూరంగా ఉండాలని ధూమపానం, పొగాకుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. హుక్కా సెంటర్లపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. పొగ కంటే హుక్కా హానికరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
Horrific Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం