NTV Telugu Site icon

Big Breaking: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య..

Cheppoddandicongress Mla Wofe Susaid

Cheppoddandicongress Mla Wofe Susaid

Wife of Congress MLA: కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అల్వాల్ పంచశీల కాలనీలోని ఓ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు కుమారుడు యోజిత్ (11 ), రిషిక శ్రీ (9) కుమార్తె ఉన్నారు. రెండు రోజులుగా ఆమె పాఠశాలకు వెళ్లలేదు.

Read also: Honey Rose : అబ్బా.. ఏముంది మామా.. చూస్తూ బ్రతికేయోచ్చు..

ఇంటికి వచ్చిన రూపాదేవి అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల విచారణ చేపట్టారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే సత్యం ఉదయం నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమలతో పాటు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. పోలీసులు రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Read also: Indigo : ఇండిగో విమానంలో గందరగోళం.. ఏడ్చేసిన ప్రయాణికులు.. 30నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు

మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆకస్మిక మరణ వార్త తెలియగానే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి అర్థరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అల్వాల్ లోని పంచవటి కాలనిలో ఉన్న మేడిపల్లి సత్యం నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రాత్రి అంతా మేడిపల్లి సత్యం నివాసంలోనే ఎమ్మేల్యే కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడే ఉండి కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా ఉంటుందని తెలిపారు.
KGF Re Release : ఏంటి.. ప్రశాంత్ మామ ఇలా షాక్ ఇచ్చావ్..

Show comments