Site icon NTV Telugu

Chintala Ramachandra Reddy : కుటుంబ పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా?

Chintala Ramachandra Reddy

Chintala Ramachandra Reddy

నిజమాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అర్వింద్‌ ఇంటి ముందు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేసేందుకు వచ్చి.. ఆయన నివాసంపై దాడి చేశారు. దీంతో అర్వింద్‌ ఇంటి వద్ద టెన్షన్‌ వాతావరణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను చెదరగొట్టారు. భారీగా బందోబస్తు నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. ఎంపీ అర్వింద్‌ ఇంటి దాడి మీద హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా బీజేపి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మీడియా ముఖంగా కవిత చెప్పుతో కొడతా….. చంపుతామని చెప్తున్నా… పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. కుటుంబ పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీని మర్డర్ చేస్తారా? అందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? అని ఆయన మండిపడ్డారు.

నాయకులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో యావత్తు తెలంగాణ తల దించుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్వింద్‌ ఇంటిపై దాడికి వారి మీద 24 గంటల్లో చర్యలు తీసుకోకుంటే డీజీపీనీ కలుస్తామని ఆయన వెల్లడించారు. అలాగే కవిత వ్యాఖ్యల పట్ల పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

డీజీపీ కూడా స్పందించకుంటే న్యాయస్థానంను అశ్రయిస్తామన్నారు. దాడి చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు కమీషనర్ తెలిపారని, ప్రెస్ మీట్ లో కవిత మాటలను కమిషనర్ వీక్షించారన్నారు. అయితే.. జూబ్లీహిల్స్‌లో గతంలో మా కార్యకర్తల మీద జరిగిన దాడికి ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, కేసు కూడా బుక్ చేయలేదన్నారు. బీజేపీ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తోందని, మండల స్థాయిలో దాడికి నిరసనగా కేసిఆర్ దిష్టి బొమ్మతో పాటు…నిరసన తెలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సూచించారన్నారు.

Exit mobile version