Site icon NTV Telugu

తమిళనాడు గవర్నర్‌ని కలిసిన చిన్నజీయర్ స్వామి

రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు తమిళనాడు గవర్నర్ R.N.రవిని భగవత్ ను ఆహ్వానించారు. ఈరోజు చెన్నైలోని గవర్నర్‌ నివాసానికి వెళ్లిన చిన్నజీయర్‌ స్వామి.. ఆహ్వాన పత్రికను అందించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు 1,035 కుండ శ్రీ లక్ష్మీ నారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ట కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరగనుంది. ఫిబ్రవరి 14న పూర్ణాహుతిలో రాష్ట్రపతి పాల్గొనబోతన్నారు. ఇప్పటికే చిన్నజీయర్‌ స్వామి దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక, రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆయన వెంట మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు.9వ తేదీన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ హాజరవుతారు. ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సహస్రాబ్ది ఉత్సవాలు దగ్గరపడుతుండడంతో… ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఉత్సవాల ప్రారంభానికి ఇంకా 15 రోజులే వుంది.

Exit mobile version