ఢిల్లీ పర్యటనలో ఉన్న త్రిదండి చిన్న జీయర్ స్వామి.. వరుసగా కేంద్రం పెద్దలను కలుస్తున్నారు.. బుధవారం రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా రావాలంటూ ఆహ్వానించిన ఆయన.. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.. శంషాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన రామానుజ విగ్రహ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు.. ఈ సందర్భంగా గంటకుపైగా అమిత్‌షాతో చర్చలు జరిపారు.. చిన్నజీయర్ తో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు తదితరులు ఉన్నారు. రామానుజ విగ్రహ ఏర్పాటు అవశ్యకతపై అమిత్‌షాకు వివరించారు.. కాగా, ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతా మూర్తి విగ్రహం ఏర్పాటు కాబోతోంది. సుమారు వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల రామానుజ పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌నాథ్ సింగ్, మోహన్ భగవత్‌నూ కూడా ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి.
అమిత్‌షాతో చిన్న జీయర్ భేటీ.. గంటకు పైగా చర్చలు
