NTV Telugu Site icon

Mother: చిన్నారికి బ్రెయిన్‌ ట్యూమర్.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య..

Suicide

Suicide

తన కూతురికి బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉందని అల్లాడిపోయింది ఓ తల్లి.. ఉండేది అద్దె కొంపలో.. రెక్క ఆడితేగానీ డొక్కాడని పరిస్థితి.. ఈ సమయంలో తనకు పుట్టిన బిడ్డకు బ్రెయిన్‌ ట్యూమర్‌ అని తేలింది.. అప్పటికే అప్పులు చేసి దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు ఆ పేద దంపతులు.. అయినా, ఆ చిన్నారికి నయం కాలేదు.. దానికి తోడు ఆ చిన్నారికి చికిత్సచేయించలేని తన ఆర్థిక పరిస్థతి ఆమెను వెక్కరించింది.. దీంతో, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్‌లో కలకలం రేపుతోంది..

Read Also: Gautam Adani : అదానీ కొత్త బిజినెస్‌..! అంబానీకి టెన్షన్‌..!

పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పాండురంగ నగర్ లో గత రెండేళ్లుగా అద్దె ఇంట్లోకి నివసిస్తూ రోజువారి పనులు చేస్తూ జహీరాబాద్ కు చెందిన పూజా-అరవింద్ అనే దంపతు బతుకుబండి లాగుతున్నారు.. వీరికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఏడాది క్రితం ఓ పాప పుట్టింది… తన పాప పుట్టిన నెల రోజుల తర్వాత చిన్నారి కి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలియగానే అప్పటినుంచి పలు ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం 4-5 లక్షలు ఖర్చు చేశారు.. ఇప్పటికే అప్పుల పాలైనా.. పాప వ్యాధి మాత్రం యథావిథిగానే ఉండడంతో, భవిష్యత్తులో తన పాప పరిస్థితి ఏమవుతుందని భయంతో, చివరికి అద్దె పైసలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన పూజా.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.. దీనితో సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..