Viral : సార్.. నా సైకిల్ పోయింది.. వెతికి పెట్టండి.!

  • “నా సైకిల్ పోయింది సార్.. వెతికి పెట్టండి” అంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చిన్నారి
  • అపార్ట్మెంట్ సెల్లార్‌లో సైకిల్ దొంగతనం – విచారంతో చిన్నారి ఫిర్యాదు
  • పాప మనసును ఆదరిస్తూ ధైర్యం చెప్పిన నార్సింగి పోలీసులు
  • దొంగను పట్టుకుని సైకిల్ వెతికి ఇస్తామని హామీ
Viral

Viral

Viral : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఓ హృదయాన్ని తాకే ఫిర్యాదు నమోదు అయ్యింది. అపార్ట్మెంట్‌ సెల్లార్‌లో ఉంచిన తన సైకిల్‌ దొంగలు ఎత్తుకుపోయారని ఓ చిన్నారి పోలీసులను ఆశ్రయించింది. ఎంతో ఇష్టపడి కొన్న సైకిల్ దొంగతనం కావడంతో బాధపడిన ఆ చిన్నారి, “ఎలాగైనా దొంగను పట్టుకుని నా సైకిల్‌ని తిరిగి ఇవ్వండి” అంటూ వేడుకుంది. పాప మనసును గమనించిన నార్సింగి పోలీసులు ఆ చిన్నారిని ఆదరించి మాట్లాడారు. “నీ సైకిల్‌ని వెతికి పట్టుకుంటాం, ఆందోళన చెందకు” అంటూ ఆమెను ధైర్యపరచి పంపించారు.

Akanda2 : రికార్డ్ స్థాయి ఓటీటీ డీల్!