CM Revanth Reddy: ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముంబైలో చేరుకున్న సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారని తెలిపారు. మోడీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చా అన్నారు. దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు.
Read also: Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం… డ్యాం పై చల్లారని నీటి మంటలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయని తెలిపారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోడీ భావించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చామన్నారు ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేసామన్నారు. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చామని తెలిపారు. ఆ తరువాత ఆయన తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారని అన్నారు. వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నామన్నారు.
Read also: Green Tea: గ్రీన్ టీ మంచిదని ఎక్కువగా తాగుతున్నారా? అయితే ..
రూ. 1కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారని తెలిపారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించిందని తెలిపారు. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టామని తెలిపారు. 2025 జనగణలో తెలంగాణ కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ లో తీర్మానం చేసి.. మోడీని డిమాండ్ చేసామని తెలిపారు. దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చిందని తెలిపారు. మహాత్మా జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెస్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపి దేశానికి ఒక దారి చూపారని తెలిపారు. ఇంతటి ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకి వెళ్లకూడదని తెలిపారు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోడీ గుజరాత్ కు తరిలించుకొని పోయారన్నారు. మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని కోరారు.
Polavaram Project: పోలవరంలో విదేశీ నిపుణుల బృందం.. ప్రాజెక్టుపై రానున్న స్పష్టత..