Site icon NTV Telugu

CM KCR: నేడు సూర్యాపేటకు సీఎం.. పార్టీ తోరణాలతో గులాబీమయంగా జిల్లా కేంద్రం..

Cm Kcr

Cm Kcr

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యాలయాలు, భవనాలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ఉదయం 10.35 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 11.15 గంటలకు హెలికాప్టర్‌లో సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. పట్టణంలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలకు సంబంధించి పూర్తయిన ప్రధాన భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం పాత వ్యవసాయ మార్కెట్‌లో రూ.40 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తారు. ఆ తర్వాత జిల్లా పోలీసు కార్యాలయం, సమీపంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

Read also: Tirumala Tickets: భక్తులకు టీటీడీ శుభవార్త.. వసతి గదుల టికెట్లు 25న విడుదల..!

అనంతరం రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో మధ్యాహ్నం 3 గంటలకు కొత్త వ్యవసాయ మార్కెట్ సమీపంలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి శనివారం పరిశీలించారు. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ కటౌట్లు, పార్టీ తోరణాలతో సూర్యాపేట జిల్లా కేంద్రం గులాబీమయమైంది. కొత్త భవనాలు విద్యుద్దీపాలలో మెరుస్తున్నాయి.
Tirumala Tickets: భక్తులకు టీటీడీ శుభవార్త.. వసతి గదుల టికెట్లు 25న విడుదల..!

Exit mobile version