NTV Telugu Site icon

CM KCR Bihar Tour: నేడు బీహార్‌ సీఎం కేసీఆర్‌.. బీహార్‌ సీఎంతో భేటీ

Kcr

Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేడు బిహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12:15 గంటలకు పాట్నాకి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన ప్రకారం గాల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన ఐదుగురు సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈనేపథ్యంలో సికింద్రాబాద్‌ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి భోజనం చేస్తారు.

ఆతరువాత సైనిక కుటుంబాలు, అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక భేటీలో పాల్గొనున్నట్లు సమాచారం. ఇక, తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్, నితీశ్ చర్చించే అవకాశం వుంది. అయితే.. ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీశ్ మళ్లీ తిరిగి బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, 2024 ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేసి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఇటీవల దేశ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జాతీయ రాజకీయాలపై ఇరు నేతలు ఎలాంటి చర్చలు జరుపుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే.. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పలుమార్లు ఆయన చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇక.. తాజాగా ఇవాళ బిహార్ వెళ్లనున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్‌పై ఎలాంటి ప్రకటన వస్తుందో అని రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో.. బీజేపీ, కాంగ్రెసేతర కూటమిని ఈ సారి ఢిల్లీ గద్దెపై నిలపేందుకు కేసీఆర్ సర్వత్రా కృషి చేస్తున్నారు.
Karnataka Eidgah Case: ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

Show comments