Site icon NTV Telugu

CM KCR Bihar Tour: బీహార్‌ సీఎంతో కలిసి చెక్కులు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్‌

Kcr

Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేడు బిహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పాట్నాలో సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. ఎయిర్‌ పోర్ట్‌లో సీఎం నితీష్‌, డిప్యూటీ సీఎం తేజస్వి స్వాగతం పలికారు. గాల్వాన్‌ అమర సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిచారు సీఎం. ఒక్కో కుటుంబానికి పదిలక్షల సహాయం అందజేశారు. బీహార్‌ సీఎం నితీష్‌తో కలిసి చెక్కులను తెలంగాణ సీఎం కేసీఆర్‌ అందించారు. అనంతరం సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం నితీష్‌ తో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు.

సికింద్రాబాద్‌ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి భోజనం చేస్తారు. 2024 ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేసి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఇటీవల దేశ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జాతీయ రాజకీయాలపై ఇరు నేతలు ఎలాంటి చర్చలు జరుపుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పలుమార్లు ఆయన చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇక.. తాజాగా ఇవాళ బిహార్ వెళ్లనున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్‌పై ఎలాంటి ప్రకటన వస్తుందో అని రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో.. బీజేపీ, కాంగ్రెసేతర కూటమిని ఈ సారి ఢిల్లీ గద్దెపై నిలపేందుకు కేసీఆర్ సర్వత్రా కృషి చేస్తున్నారు.
Mother Killed Daughter: ప్రియుడి కోసం కన్నకూతుర్ని కడతేర్చిన తల్లి

Exit mobile version