Site icon NTV Telugu

Cheque Power : ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు.. క్లారిటీ ఇచ్చిన పంచాయతీ రాజ్ శాఖ

Cheque Canel

Cheque Canel

Cheque Power : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల నిర్వహణలో కీలకమైన ఉప సర్పంచ్‌ల అధికారాలను ప్రభుత్వం తగ్గిస్తోందని, వారికున్న ‘చెక్ పవర్’ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, ప్రభుత్వం ఇప్పటి వరకు అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని పంచాయతీ రాజ్ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గ్రామాల్లో పాలనను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం వివిధ సంస్కరణలను ఆలోచిస్తున్నప్పటికీ, ఉప సర్పంచ్‌ల ఆర్థిక అధికారాలను తొలగించే ఆలోచన ప్రస్తుతానికి లేదని అధికారులు తేల్చి చెప్పారు.

Anantapur: కసాయి తండ్రి కిరాతకం.. ఇద్దరు కూతుర్లను తుంగభద్ర కాలువలో తోసివేత.. చివరకు..?

గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల సంయుక్త సంతకం (Joint Signature) తప్పనిసరి అనే నిబంధన ప్రస్తుతం అమలులో ఉంది. అయితే, ఈ అధికారాన్ని తొలగించి కేవలం సర్పంచ్ లేదా కార్యదర్శికే పరిమితం చేస్తారనే వార్తలు స్థానిక సంస్థల ప్రతినిధులలో కొంత ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం, ప్రజలు , ప్రజా ప్రతినిధులు ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరింది. నిబంధనల ప్రకారం ఏదైనా మార్పు చేయాల్సి వస్తే ప్రభుత్వం అధికారికంగా గెజిట్ లేదా ఉత్తర్వులను విడుదల చేస్తుందని, అంతవరకు ఇలాంటి ప్రచారాలకు తావు లేదని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల్లో పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటుందని పంచాయతీ రాజ్ శాఖ వివరించింది.

Shivaji : ‘బూతు’ వ్యాఖ్యలపై కమల్ కామరాజు సంచలన కౌంటర్..చూసే కళ్లలోనే ఉంది దరిద్రం..!

Exit mobile version