NTV Telugu Site icon

Chennur Farmers: హామీలు అమలు చేయండి.. సీఎం రేవంత్ కి చెన్నూరు రైతులు లేఖ..

Revanth Reddy Chennuur Formers

Revanth Reddy Chennuur Formers

Chennur farmers: హామీల అమలు కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి రైతులు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చెన్నూర్ నియోజకవర్గం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వినూత్న కార్యక్రమానికి రైతులు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు., చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామం మొదలుకొని రైతులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయక పోవడంతో రైతులు ఆవేదన చెందారు. పోస్ట్ కార్డు ద్వారా తమ ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డికి పంపారు. రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసి తీరాలని కోరారు. గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేసి తీరాలని లేఖలో రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు.

Read also: Video Viral: బికినీ ధరించి బస్సులోకి ప్రవేశించిన మహిళ.. చివరకు..

1. వరి ధాన్యానికి ఇస్తానన్న బోనస్ రూ.500,

2. రైతు భరోసా రూ.10వేలకి బదులు రూ.15వేలు ఇవ్వాలి.

3. రైతు కూలీలకు ఇస్తానన్న రూ.12వేలు చెల్లించాలి.

4. రైతు రుణమాఫీ రూ.2 లక్షలు మాఫీ చేయాలి.

5. వీటితోపాటు రైతు బీమా, వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా రూ.25వేలు చెల్లించాలి.

Read also: Teja sajja : ‘మిరాయ్’ గా వస్తున్న తేజ సజ్జా.. మైండ్ బ్లాకయ్యేలా గ్లింప్స్..

అని లేఖలో సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు రాసి పంపారు. సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. హామీల అమలు కోసం ప్రజాస్వామ్య పంతాలో నిరసన తెలిపారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మద్దతు ప్రకటించారు.
Shaykh Ismail : 40 ఏళ్లుగా హజ్ యాత్రికులకు ఉచితంగా టీ, కాఫీలు అందిస్తున్న ఇస్మాయిల్ కన్నుమూత