NTV Telugu Site icon

హైదరాబాదులో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్…

హైదరాబాదులో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. నగర శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ ఆనవాళ్లు కనిపించాయి. రాచకొండ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా మరొకసారి కనబడింది. కుషాయిగూడ పరిధిలో చెడ్డి గ్యాంగ్ రెక్కీ చేసినట్లు తెలుస్తుంది. పలు కాలనీలలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. చెడ్డి గ్యాంగ్ కదలికల పై జంటనగరాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాయి పోలీసులు. నగరంలో మరొకసారి పాగా వేసిన చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు సిద్ధమయ్యాయి. అయితే గతంలో కూడా ఈ గ్యాంగ్ నాగరాణి వణికించిన విషయం తెలిసిందే.