Govt Job Exam Fraud: ఓ వ్యక్తి ప్రభుత్వం ఉద్యోగం కోసం అడ్డదారులు తొక్కాడు. కానీ ఆ ఉద్యోగం కావాలంటే అంతలా పరీక్షలు రాసి ఆ జాబ్ కొట్టలేడు. మరి ఏం చేయాలో అతనికి అర్థంకాలేదు. అతనికి తెలివి ఏమోగానీ అతి తెలివి ఉపయోగించాడు ప్రభుద్దుడు. కానీ అతి తెలివి కారణంగా అతను జైలు ఊసలు లెక్కపెడతాననే చిన్న లాజిక్ మిస్సయ్యాడు. పరీక్ష నువ్వు రాయకపోయిన పర్వాలేదు.. వేరే వారి ద్వారా రాస్తే నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఎగిరి గంతేసి ఒకే అనేసాడు.. కానీ అక్కడ పరీక్ష రాయడానికి ఇతని ఫోటో కాకుండా రాసేవాడే ఫోటో ఉంటుందని మాత్రం మర్చిపోయాడు. చివరకు ఉద్యోగంలో చేరడానికి వెళ్లిన వ్యక్తి, పరీక్ష రాసిన వ్యక్తి ఫోటోలు వేరు వేరు కావడంతో అధికారులు అతన్ని అదుపులో తీసుకుని విచారించగా అసలు గుట్టు బయటపడింది. దీంతో అధికారులు షాక్ తిన్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అల్వాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Read also: Kapil Dev Birthday: కపిల్ దేవ్ బర్త్ డే.. రజనీకాంత్ ‘లాల్ సలామ్’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్!
హర్యానాకు చెందిన బాల్‌రాజ్ (23) గతేడాది నవంబర్‌లో తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగం కోసం పోటీ పరీక్ష రాయాలనుకున్నాడు. కానీ అతని స్నేహితుడు అజయ్ (బ్రోకర్) తనకు తెలిసిన ఎవరైనా పరీక్ష రాస్తే ఉద్యోగం వస్తుందని నమ్మించాడు. దీంతో బాల్‌రాజ్ తన బదులు మరొకరితో కలిసి అల్వాల్ లయోలా అకాడమీలో పోటీ పరీక్షకు హాజరయ్యాడు. బాలరాజ్ ఉద్యోగానికి అర్హత సాధించడంతో అటవీ శాఖ అధికారులు అపాయింట్‌మెంట్ లెటర్ పంపారు. అయితే ఉద్యోగంలో చేరేందుకు వచ్చిన వ్యక్తి పరీక్ష రాసిన వ్యక్తి ఫొటో వేరే ఉండడంతో సంబంధిత అధికారులకు అనుమానం వచ్చి అతడ్ని సంబంధిత అధికారులు నిలదీయడంతో అసలు విషయం వెల్లడించారు. కాగా.. తన స్థానంలో పరీక్ష రాసింది వేరే వ్యక్తి అని చెప్పడంతో.. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాల్‌రాజ్ అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. పరీక్ష రాసిన వ్యక్తి, అజయ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోందని చెప్పారు.
Thandel : బుజ్జి తల్లే వచ్చేత్తున్న కదే.. ఈ సారి గురి తప్పదేలే అంటున్న నాగచైతన్య
