Site icon NTV Telugu

Cheater Shiva Shankar Babu Arrest: 13 పెళ్లిళ్ళ నిత్య పెళ్ళికొడుకు శివ శంకర్ బాబు అరెస్టు

Shiva Shankar Babu Arrest

Shiva Shankar Babu Arrest

తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్ళి చేసుకుని మోసం చేసిన నిత్యపెళ్ళి కొడుకు శివశంకర్‌ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులో తీసుకున్నారు. శివశంకర్‌పై హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో కేసులు నమోదయ్యాయి. శివశంకర్ ను అరెస్ట్ చేయాలని బాధిత మహిళలు రోడ్డెక్కడంతో వ్యవహారాన్ని సీరియస్‌ తీసుకున్నారు పోలీసులు. అమెరికాలో ఉన్న యువతిని సైతం మోసం చేసి, ఆ యువతి నుంచి 35 లక్షలు వసూలు శివశంకర్ వసూలు చేసాడని విచారలో తేలిందని పోలీసులు తెలిపారు.

read also: Drunk And Driving: పాతబస్తీలో మందు బాబు హల్చల్.. పోలీసుల ముందే ప్యాంట్‌ విప్పి మరీ..

ఆంధ్రా లోని గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివ శంకర్‌, ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మందిని ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని యువతులను మోసం చేశాడు. పెళ్లికి విడాకులు అయిన యువతులనే టార్గెట్ చేసాడు ఆ ప్రబుద్ధుడు. అదికూడా వివాహ పరిచయ వేదికే అతడ మార్గం. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. పెద్ద కంపెనీలో పనిచేస్తానని డే అండ్​ నైట్​ డ్యూటీలు ఉంటాయని, ఒకరి కళ్లుగప్పి ఇంకొకరి దగ్గరి వెళ్తూ కాలం వెళ్లదీశాడు. పెళ్లి చేసుకున్న వారందరినీ ఎక్కడెక్కడో ఉంచటం కాదు, పక్కపక్క వీధుల్లోనే ఉంచి ఎవరికీ దొరకకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే.. శివశంకర్​ మోసానికి బలైన ఇద్దరు యువతులు జూలై 14న హైదరాబాద్​ ప్రెస్​క్లబ్​లో ఈ నిత్యపెళ్లికొడుకు బాగోతాన్ని బయటపెట్టారు. శివశంకర్‌ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు డిమాండ్‌ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శివశంకర్‌ ను అదుపులో తీసుకున్నారు.

Exit mobile version