Hyderabad Crime: హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు యూ టర్న్ చేస్తుండగా రాంగ్ రూట్‌లో వెళ్తున్న బైక్ ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాదిక్ అలీగా, గాయపడిన వ్యక్తి నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఎస్ ఖాజావలీ మొహినుద్దీన్‌గా గుర్తించారు.
Read also: Valentines Night OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘వాలంటైన్స్ నైట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలక్ పేటలోని ప్రభుత్వ క్వార్టర్స్ లో సీఐ సాదిక్ అలీ, ఎస్సై మొహినుద్దీన్ ఉంటున్నారు. ఎల్బీనగర్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లి మలక్‌పేటలోని తన క్వార్టర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ కారును వదిలి పారిపోయాడు.. అయితే.. ఎల్బీనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు వున్నట్లు పోలీసులు గుర్తించారు. వినుషా శెట్టి పేరు పై కారు రిజిస్ట్రేషన్ ఉందని తెలిపారు. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ చలాన్స్ ఉండటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాద ఘటన పోలీసులు తెలుపుతూ.. ముందగా వెళుతున్న కారు రాంగ్ రూట్ లో యూ టర్న్ తీసుకుంటుండగా వెనకనుంచి బైక్ పై వస్తున్న పోలీసులను గమనించిన కారు డ్రైవర్ డోర్ ఓపెన్ చేశాడు. దీంతో వెనకనుంచి వస్తున్న బైక్ ఒక్కసారిగా డోర్ కు తగిలింది. అందులో ప్రయాణిస్తున్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాదిక్ అలీ, నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఎస్ ఖాజావలీ మొహినుద్దీన్ కింద పడిపోయారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాదిక్ అలీ చనిపోగా.. ఖాజావలీ మొహినుద్దీన్ తీవ్ర గాయాలయ్యాయి.
SEBI Warning: సెబీ హెచ్చరిక.. అధిక రాబడిని క్లెయిమ్ చేస్తున్న కంపెనీల పట్ల జాగ్రత్త