ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి టెర్మినల్ నుంచి దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. పండుగలు, సెలవుల కారణంగా రైల్వేల్లో పెరిగిన రద్దీని తగ్గించేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు బయలుదేరనుంది. అలాగే, ఈ నెల 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు చర్లపల్లి నుంచి నర్సాపూర్‌కు మరో ప్రత్యేక రైలును నడపనున్నారు.
IndiGo chaos: “ఇండిగో” మెడలు వంచాలి.. 2009లో “పుతిన్” చేసినట్లు చేయాలి..
చర్లపల్లి–తిరుపతి ప్రత్యేక రైలు మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్డానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, డోన్, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట్ తదితర స్టేషన్లలో ఆగుతూ చివరకు రేణిగుంట చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అదే విధంగా, చర్లపల్లి నుంచి నర్సాపూర్‌కు వెళ్లే ప్రత్యేక రైలు నల్లగొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు వంటి ముఖ్య స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయంతో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని సీపీఆర్‌ఓ శ్రీధర్ వివరించారు. పెరిగిన ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను కూడా అవసరమైన సమయాల్లో నడపనున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Kia EV2: సంచలనానికి సిద్ధమవుతున్న కియా.. మినీ ఎలక్ట్రిక్ SUV, EV2ను విడుదల చేయబోతోంది.. 480KM రేంజ్
