Site icon NTV Telugu

చాంద్రాయణగుట్ట మర్డర్‌ కేసు.. ఎస్‌ఐపై వేటు

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య ఘటన కలకలం సృష్టించింది.. చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్‌ వైపు కారులో వెళ్తున్న హమీద్‌ అనే వ్యక్తిని వెంబడించిని గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న హమీద్‌ను బయటకు లాగి నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో పాతబస్తీలో భయాందోళనకు నెలకొన్నాయి.. అయితే, ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చాంద్రాయణగుట్ట ఎస్‌ఐ వెంకటేష్‌ను సస్పెండ్‌ చేశారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్.. నిందితులతో తనకు ప్రాణహాని ఉందని ఇవాళ ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుడు హమీద్‌.. కానీ, ఆ ఫిర్యాదును స్థానిక ఎస్‌ఐ వెంకటేష్‌ పట్టించుకోలేదు.. కానీ, ఈరోజు సాయంత్రం నడి రోడ్ పై హత్యకు గురయ్యాడు హమీద్‌.. ఈ ఘటనపై సీరియస్‌ అయిన సీపీ.. ఫిర్యాదు తీసుకోవటంలో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ వెంకటేష్ ను సస్పెండ్ చేశారు.

Exit mobile version