టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తెలంగాణలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు.. అదేంటి చంద్రబాబు… ప్రభుత్వ ఆస్పత్రిలో.. అది కూడా తెలంగాణలో ప్రారంభించడం ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. అవును ఇది నిజమే.. మహబూబాబాద్ జిల్లాలో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను వర్చ్యువల్ పద్ధతిలో ప్రారంభించారు చంద్రబాబు.. రూ. 50 లక్షల ఖర్చుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు..
Read Also: Viral: సెకండ్ హ్యాండ్‌లో సైకిల్ కొన్న నాన్న.. మురిసిపోయిన కుమారుడు..!
ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం, టెక్కలిలలో ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి రాగా.. తాజాగా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సిద్ధమైన ఆక్సిజన్ ప్లాంట్‌ను చంద్రబాబు ప్రారంభించారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… విపత్తుల సమయంలో ఎన్జీవోలు, ఇతర సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వంతో కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సాధించిన విజయాలను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు.. విద్య, వైద్యంతో పాటు విపత్తుల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన సేవలను గుర్తు చేశారు. ట్రస్ట్ ఏర్పాటు అయిన తర్వాత 11 వేల హెల్త్ క్యాంప్‌లు నిర్వహించారని.. సుమారు 18 కోట్ల రూపాయల విలువైన మందులు, ఆహారంతో పాటు ఇతర సాయం బాధితులకు అందిందని చంద్రబాబు అన్నారు.
