NTV Telugu Site icon

New Dream Spa: స్పా ముసుగులో వ్యభిచారం.. చందానగర్ లో పోలీసులు రైడ్..

New Dream Spa

New Dream Spa

New Dream Spa: నగరంలో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం జోరుగా సాగుతోంది. పోలీసులు రైడ్ చేసి అరెస్టులు చేస్తున్నా నిర్వాహకులు వేరే దారి ద్వారా ఇలాంటి దందాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ చందానగర్ లో వెలుగు చూసింది.. చందానగర్‌లోని స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. నలుగురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంలో చందానగర్ పరిధిలో స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసుల రైడ్ చేశారు. లోపలికి వెళ్లి చూడగా హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు షాక్ తిన్నారు. స్పా నిర్వాహకులు న్యూ డ్రీమ్ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు గుర్తించారు. అక్కడ వున్న నలుగురు యువతులు, ఒక విటుడిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. పట్టుబడ్డ వారి నుంచి నగదు, 6 మొబైల్ ఫోన్స్, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసును హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు.. చందానగర్ పోలీసులకు కేసును అప్పగించారు. కేసు నమోదు చేసుకుని చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతులు ఎవరు? ఎప్పటి నుంచి స్పా సెంటర్లో పని చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
KKR Captain: కేకేఆర్ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా టీమిండియా నయా సంచలనం!

Show comments