Site icon NTV Telugu

Chamala Kiran Reddy : ఎవరి గుబ గుయ్యిమంటుందో హరీష్ రావుకి తొందరలోనే తెలుస్తుంది

Mp Chamala Kiran Kumar Reddy

Mp Chamala Kiran Kumar Reddy

మాజీమంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు చామల కిరణ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. “ఎవరి గుబ గుయ్యిమంటుందో హరీష్ రావుకి తొందరలోనే తెలుసుకుందేమో. లక్ష ఇల్లు ఎక్కడ కట్టారు? ఎవరికిచ్చారు? హరీష్ రావే చెప్పాలి” అని అన్నారు. అధికారం చేతిలో ఉండగా, ఇష్టానుసారంగా నాళాలను చెరువులుగా మార్చి, కబ్జాలు చేశారు అని ఆయన విమర్శించారు. చిన్న వానే పడితే హైదరాబాద్‌లో సరిగా తిరగలేని పరిస్థితి ఏర్పడిందని, దానికి కారణం ఎవరు అనేది హరీష్ రావు వివరించాలన్నారు.

ఉపఎన్నికలు హరీష్ రావు కోసం ట్రబుల్ షూటర్‌ రోల్ మాత్రమే అవుతున్నాయని చామల కిరణ్ రెడ్డి పేర్కొన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఎంత డబ్బు పెట్టారో ప్రజలకు తెలుసు, జూబ్లీహిల్స్‌లో కూడా అదే చేయాలని అనుకుంటే, ఆ నాటకాలు జరగవని స్పష్టం చేశారు. నవీన్ యాదవ్ పేరుకి మించిన ప్రాముఖ్యత వల్ల, బీఆర్‌ఎస్ ఇంకా గెలవనిదని తెలిసిపోయిందని, ఎవరు గూండాలు, ఎవరు డబ్బులతో గెలవాలని చూస్తున్నారో ప్రజలు 11వ తారీఖున తేలుస్తారని ఆయన చెప్పారు.

హరీష్ రావు ప్రజల సెంటిమెంట్ పై ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారని చామల కిరణ్ రెడ్డి మండిపడ్డారు. డెవలప్మెంట్‌పై అసలు మాట్లాడడంలేదని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను తప్పుదారి పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. “ప్రజలు అమాయకులు కావు. మీ పార్టీ భూస్థాపితం కావడం పక్క, మీరు నువ్వు, నీ బామ్మర్దికి మాత్రమే ఎన్నిక ఫలితాలు చెంప చెల్లిస్తాయని చేయడం ప్రజలు చూడగలరు” అని ఆయన హెచ్చరించారు.

PKK Turkey Peace: తుర్కియేలో 40 ఏళ్ల పోరాటానికి ముగింపు..

Exit mobile version