NTV Telugu Site icon

Chain Snacher: ఎల్‌బినగర్‌లో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు మహిళ మెడలో..

Chain Snacher

Chain Snacher

Chain snatchers on the loose again in LBnagar: సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హల్‌ చల్‌ చేసి గంట వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్ కి పాల్పడిన ఘటన మరివకముందే మళ్లీ ఇలాంటి ఘటనలే చోటుచేసుకోవడంతో నగర ప్రజలు భయాందోళన గురవుతున్నారు. రోజుకో ప్రదేశం మార్చి మహిళలకు వనుకు పుట్టిస్తున్నారు. ఈసారి ఎల్‌బినగర్‌లో చైన్‌ స్నాచర్లు తెగబడ్డారు. బ్యాగును భుజాన వేసుకుని వెళుతున్న 50ఏళ్ల వృద్ధురాలిని టార్గెట్‌ చేశారు. వారి ఎదురుగా వెళుతూ తన మెడలో గొలుసు వుందని గమనించారు. కారు పక్కన బైక్‌ ఆపి ఆమె మెడలో వున్న బంగారం గొలుసును తెంచుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. ఆమె అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది. లబోదిబోమంటున్న బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు తులాల బంగారం గొలుసు తెంపుకెళ్లారని వాపోయింది. ఎల్.బి. నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫోటేజ్‌ ఆధారంతో దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ గా మారింది.

Read also: Astrology: జనవరి 13, శుక్రవారం దినఫలాలు

గత శనివారం ఉదయం చైన్ స్నాచర్లు హడలెత్తించిన విషయం తెలిసిందే.. గంటల వ్యవధిలో 6 చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు గల్లీలో రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌, ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ హడలెత్తిస్తున్నాయి. గంటలోనే ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ లలో చైన్‌ స్నాచింగ్‌ జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నవారిని టార్గెట్‌ చేస్తూ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా చైన్‌ స్నాచింగ్‌ చేస్తూ కళ్లుమూసి తెరిచేలోగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ రాచకొండ పరిధిలో ఆరు చోట్ల స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులకు సవాల్‌ గా మారింది. ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పరిధిలో స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో.. స్నాచర్స్ ను పట్టుకోవడానికి పోలీస్ బృందాలు రంగంలో దిగారు. హైదరాబాదులోని అన్నిచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు

Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

హైదరాబాద్ లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్ల దొంగల హల్చల్ సృష్టించారు. ఉప్పల్ మాస్టర్ చెఫ్ సమీపంలో మహిళ మెడలో నుండి బంగారు చైన్ అక్కెల్లిన దుండగులు పక్కనే మరొక దొంగతనానికి పాల్పడ్డారు. ఉప్పల్ కళ్యాణపురిలో ఉదయం వాకింగ్ కు వెళుతున్న సమయంలో మహిళ మెడలోని పుస్తెలతాడును లాక్కొని వెళళ్లారు. బాధితురాలు ఉప్పల్ పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫోటేజ్‌ ఆదారంతో దొంగలతను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గంటల వ్యవధిలో ఆరు చోట్ల దొంగతనాలు జరగడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు చైన్‌ స్నాచర్‌ ను త్వరలో పట్టుకోవాలని మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. కాగా.. గత సంవత్సవరం అక్టోబర్‌ లో కూడా హైదరాబాద్‌ లోని నార్సింగిలో చైన్‌ స్నాచర్స్‌ జరగడం గమనార్హం. తిరుమల హిల్స్ లో నడుచుకుంటూ వెళుతున్న అరుణ అనే మహిళ మెడలో నుండి 4 తులాల బంగారు గొలుసు స్నాచింగ్ జరగడం తెలిసిందే..
Pakistan: భారత ఛానెళ్లను ప్రసారం చేస్తున్న కేబుల్ ఆపరేటర్లపై పాక్ ప్రభుత్వం చర్యలు..

Show comments