Chada Venkata Reddy: ఫిరాయింపులతో రాజకీయ వ్యవస్థ బూజు పడుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. కేసిఆర్ పంటలు ఎండిపోతున్నాయి అని ముమ్మాటికీ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శ చేయలేదన్నారు. కేసీఆర్ గతం నెమరు వేసుకోవాలని సూచించారు. కేసీఆర్ చేసే డిమాండ్ బాగానే ఉంది కానీ నువ్వు ఎంత ఇచ్చావ్..? అని ప్రశ్నించారు. ఆత్మస్తుతి పరనింద అన్నట్లు అన్నట్టు కేసిఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Read also: Babu Mohan: బీజేపీ పార్టీ టికెట్ ఇస్తానని ఇవ్వలేదు.. బాబుమోహన్ కీలక వ్యాఖ్యలు..
ఇవ్వాళ గోదావరి లో కొన్ని నీళ్ళు ఉన్నాయి అంటే సీపీఐ పోరాటంతో వచ్చిన మిడ్ మానేరు వల్లనే అని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులను ఆదుకోవాలన్నారు. ఫిరాయింపుల గురించి కేసిఆర్ మాట్లాడితే సిగ్గు పడాలన్నారు. వాటిని ప్రోత్సహించిందే కేసిఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపుల చట్టం కోరలు లేని నాగు పాము లాంటిదే అన్నారు. ఫిరాయింపులతో రాజకీయ వ్యవస్థ బూజు పడుతుందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలిపారు.
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
