NTV Telugu Site icon

Election Commission: ఆ.. ప్రకటనలు ప్రసారం చేయవద్దు.. టీవీఛానెళ్లకు ఎన్నికల సంఘం లెటర్..

Election Commitinal

Election Commitinal

Election Commission: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి…ప్రకటనలే ముఖ్యం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధాన వార్తాపత్రికలు, టీవీ ఛానెల్‌ల ద్వారా ఎన్నికల ప్రచార ప్రకటనలు ఇస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నవారే ప్రభుత్వ వైఫల్యాలను వీడియోలు తీసి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు తమ సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రచారం నిర్వహించడం ద్వారా తమ భావాలను ప్రజలకు సులభంగా చేరవేయవచ్చని పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఈ ప్రచార ప్రకటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల రాజకీయ ప్రకటనలపై నిషేధం విధిస్తూ సీఎం ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఛానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి లేఖ రాశారు.

అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల కోసం రాష్ట్ర స్థాయి ధ్రువీకరణ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని సీఈవో వెల్లడించారు. ప్రచారంలో భాగంగా, రాజకీయ పార్టీలు వార్తాపత్రికలు, టీవీ ఛానెల్‌లలో ప్రకటనలను ముద్రించి ప్రసారం చేస్తాయి, వీటిని మొదట పరిశీలన కోసం రాష్ట్ర స్థాయి ధృవీకరణ కమిటీకి పంపుతారు. పరిశీలన తర్వాతే ప్రకటనలకు ఆమోదం లభిస్తుందని, అయితే మార్పులు చేర్పులు చేసి ఆమోదం పొందిన తర్వాతే ప్రసారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఈవో కార్యాలయం స్పష్టం చేసింది. ఇష్టానుసారంగా టెలికాస్ట్‌లో మార్పులు చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందున ప్రకటనలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. కాగా..వాటి అనుమతుల్ని రద్దు చేసి ప్రసారం కాకుండా నిషేధం విధించడంతో అవి ఇకపై టీవీ ఛానెళ్ళలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలో డిస్‌ప్లే అయ్యే అవకాశంలేదు. ఈమేరకు మీడియా సంస్థలకు సీఈవో లేఖ రాశారు. ఆ ప్రకటనల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఛానళ్లకు సూచించారు.
Minister KTR: అవసరం అయితే కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగాలి..!